కాపు సంక్షేమ సేన కమిటీ నియామకం

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో కాపు సంక్షేమ సేన వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లపు వెంకట సుధా మాధవ్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పసుపులేటి ప్రసాద్ మరియు యూత్ వింగ్ అనిల్ కుమార్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. వెంకటగిరి నియోజక వర్గ కేఎస్ఎస్ అధ్యక్షులుగా సుసర్ల శ్రీహరి, నెల్లూరు జిల్లా కేఎస్ఎస్ కార్య నిర్వహణ కార్యదర్శిగా లక్కాకుల శ్రీరాములును, ఉమెన్స్ వింగ్ నెల్లూరు జిల్లా కేఎస్ఎస్ ప్రెసిడెంట్ గా శ్రీమతి నున్నా రాధిక మరియు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి నగరం హైమావతి నియమించడం జరిగింది.