ఉపాధ్యాయులను నియమించుకుంటే జనసేన తరఫున ఉద్యమిస్తాం: సిజి రాజశేఖర్

పత్తికొండ నియోజకవర్గం: పత్తికొండ మోడల్ స్కూల్లో ఆగస్టు 11వ తారీకు లోపల టీచర్స్ ను నియమించుకుంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి బైపాస్ రోడ్డు నందు ధర్నా చేస్తామని జనసేన నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ.. పత్తికొండలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ నందు టీచర్స్ ను నియమించాలని, మొదట ఆర్డీవో గారికి మరియు అలాగే జాయింట్ కలెక్టర్ గారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినతి అందజేసి సమస్య తెలియజేసినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు, అదేవిధంగా పత్తికొండ శాసనసభ్యురాలు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గారికి తెలియజేశాం కానీ ఇంతవరకు ఈ స్కూల్ నందు టీచర్స్ ను నియమించలేదు, కావున మాకు విద్యార్థుల జీవితాలు కంటే ఏది ముఖ్యం కాదు, నాడు నేడు కింద మేము స్కూల్స్ ను అభివృద్ధి చేశామని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి గారు స్కూల్లో టీచర్స్ ఎందుకు నియమించలేకపోతున్నాడు, ఇప్పటికైనా పిల్లలకు మేనమామ అని పిలిపించుకునే జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి అనేది ఏమాత్రం ఉంటే, స్కూల్స్ ఓపెన్ చేసి ఇప్పటికే 50 రోజులు అయినప్పటికీ ఇప్పటివరకు ఎందుకు మీరు నియమించలేకపోయారని జనసేన పార్టీ తరఫున సూటిగా అడుగుతున్నా, ఈ పాఠశాల నందు టిజిటి మాథ్స్, పిజిటి మాథ్స్, పిజిటి బోటనీ, పిజిటి జువాలజీ, కంప్యూటర్ టీచర్, స్కూల్ నందు లేరు అలాగే, ఆఫీస్ స్టాఫ్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లేరు మరియు హాస్టల్ స్టాఫ్ వార్డెన్ కుక్ లేనందువలన ఈ స్కూల్లో చదువుతున్న 700 మంది విద్యార్థులు చదువుకోలేక ఇబ్బందులు పడుతున్నారు, మరి కొందరు విద్యార్థులు చదువుకోలేక మధ్యలోనే ఆపేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్ కి వెళ్దామంటే ఫీజులు కట్టలేని పరిస్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు బాధపడుతూ ఇదే స్కూల్లో టీచర్స్ వస్తారని ఆశతో ధైర్యంతో అలాగే కొంతమంది స్టూడెంట్స్ ను మరికొందరు టీషీలు తీసుకువెళ్లి వేరే స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, గత సంవత్సరం పూర్తిగా మాథ్స్ టీచర్ లేనందువల్ల ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు బోధించేవారు లేక ఇప్పటికే ఒక సంవత్సరం పిల్లలు జీవితం నాశనమైంది ఇప్పటికైనా, ఈ స్కూల్ నందు ఆగస్టు 10వ తారీకు లోపల టీచర్స్ నియమించకుంటే ఆగస్టు 11వ తారీకున జనసేన పార్టీ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు నందు విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి, స్కూల్లో టీచర్స్ ను నియమించినంతవరకు, బైపాస్ రోడ్ లో ధర్నా చేపడతాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, ఇస్మాయిల్, వడ్డే వీరేష్, రవికుమార్, నాగ, భూమేష్, పాల్గొన్నారు.