ఆత్మకూరులో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో

శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరులో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో నాయకులు శ్రీరాములు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయి కార్తీక్ గౌడ్ పాల్గొన్నారు. సాయి కార్తీక్ పార్టీ కార్యకర్తలతో, జనసైనికులతో నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసే విధంగా ముందుకు రావాలని దానికి తగ్గట్లుగా ప్రణాళికతో వచ్చానని అన్నారు. రాబోయే రోజుల్లో శ్రీశైలం నియోజకవర్గంలో జనసేనా పార్టీని అడ్డాగా మర్చబోతున్నామని జనసేన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు మండలం నుంచి అరుణ్, సూరి, శ్యామ్, హబిబుల్ల, వెలుగోడు మండలం నుంచి శాలు బాషా, వీరమహిళ సుకన్య, శ్రీశైలం మండలం నుంచి బుజ్జి, మహానంది మండలం నుంచి మల్లి, రామయ్య, బండి ఆత్మకూరు నుంచి సురేంద్ర, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.