ఎన్నికల ప్రచారానికి ఘనంగా శ్రీకారం చుట్టిన బత్తుల దంపతులు

★ దుర్గామాత గుడిలో కొబ్బరికాయ కొట్టి, వీర మహిళల సమక్షంలో కార్యక్రమం ప్రారంభం.
★ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే “పవన్ కళ్యాణ్” పాలన రావాలి, మహిళల ఆర్థిక స్వావలంబనతోనే రాష్ట్ర పురోభివృద్ధి సాధ్యం.
★ మార్పు కోసం రాజానగరం నియోజకవర్గం లో జనసేన పార్టీ విజయానికి సంఘటితంగా కృషి చేద్దాం.
★ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు సాగుతా.
★ నియోజవర్గంలో ఇకనుండి ప్రణాళిక బద్ధంగా జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేద్దాం
★ సమస్యలతో వచ్చిన వారికి, జనసేన శ్రేణులకు సదా అందుబాటులో ఉంటా “బత్తుల” హామీ.
★ రాజానగరం మండలం, కొండగుంటూరు గ్రామంలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులకు కొండగుంటూరు గ్రామంలో అపూర్వ స్వాగతం పలికిన జనశ్రేణులు.
★ ముందుగా “బత్తుల” దంపతులు వీరమహిళలు, జనసైనికుల సమక్షంలో ఎన్నికల ప్రచారానికి ఘనంగా శ్రీకారం చుడుతూ, గ్రామ ఇలవేల్పు అయ్యిన దుర్గాదేవి గుడిలో కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.

రాజానగరం, “జనంకోసం జనసేన – మహా పాదయాత్ర” లో భాగంగా మరో నూతన అంశాన్ని జోడిస్తూ గ్రామంలోని ఆడపడుచులకు బొట్టు పెడుతూ, ఈసారి జనసేన పార్టీకి ఓటు వేసి, అధినేత పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇవ్వాలని, కొండగుంటూరు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి, ఒక నూతన డోర్ స్టిక్కర్, ఒక కీచైన్, ఒక పాకెట్ బ్యాడ్జీ, ఒక కరపత్రం ఇచ్చి, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మరియు వీర మహిళలు ఓటును అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ గ్రామస్తులతో మాట్లాడుతూ ఎవరికి ఏ కష్టం వచ్చినా సదా అందుబాటులో ఉంటానని, రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఓ స్వచ్ఛంద సేవకుడిగా మీకు సేవలు చేస్తానని, ఈసారి సమైక్యంగా అందరూ మాట్లాడుకుని ఈ అరాచక పాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి మార్పు కోసం “గాజు గ్లాస్” గుర్తుపై ఓటు వేసి, జనసేన పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నియోజవర్గం జనసేన పార్టీ గెలుపు కోసం ఇకనుండి రాత్రింభవళ్లు ఎనలేని కృషి చేయడానికి నాతోపాటు జనసైనికులు అందరూ సిద్ధంగా ఉండాలని, నియోజకవర్గ అభివృద్ధి కోసం జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామంలోని పెద్దలకు, యువకులకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో మహిళల విశేష ఆదరణతో ముందుకు సాగిన ఈ కార్యక్రమంలో వీరమహిళలు, నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, కొండగుంటూరు గ్రామ జనశ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.