కొండగుంటూరులో పలు మృతుల కుటుంబాలను పరామర్శించిన బత్తుల

రాజానగరం: రాజానగరం మండలం, కొండగుంటూరు గ్రామంలో ఇటీవల పలువురు స్వర్గస్తులు కాగా విషయాన్ని సీనియర్ నేత అరిగెల రామకృష్ణ ద్వారా తెలుసుకుని మృతి చెందిన వారికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు, నాసేన కోసం నా వంతు కమిటీ కో’ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి .. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..

*గిరిజాల రమణమ్మ ఇటీవల నిర్యాణం చెందగా గురువారం పెద్దకార్యం నిమిత్తం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం చెప్పడం జరిగింది.

*గిరిజాల శ్రీను కొద్ది రోజుల క్రితం పరమపదించగా వారి కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చి, వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.

*అదే గ్రామానికి చెందిన సుంకర అబ్బులు భార్య పాప కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిగా.. వారి కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అరిగెల రామకృష్ణ, ఈవూరి శ్రీను, వెంట్రపాటి బాలాజీ, అగర్తి రజినీకాంత్, నంద్యాల కాళీకృష్ణ, అరిగెల సతీష్, మేడిశెట్టి సత్యసాయి, సోడసాని వీరవెంకటమనీష్ కుమార్, సలాది రమేష్, బోయిడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.