రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: డాక్టర్ పిల్లా శ్రీధర్

  • రైతులు పండించిన ధాన్యం కొని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి అంటూ వ్యవసాయ శాఖ అధికారికి వినతిపత్రం అందించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం పట్నం నందు జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పిఠాపురం నియోజకవర్గంలో రైతుల సమస్యలపై అదేవిధంగా రైతుల పండించిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి, రైతులను కాపాడాలి అనే నినాదంతో వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి పిఠాపురం నియోజకవర్గంలో రైతుల పడుతున్న పలు సమస్యల గురించి సంబంధిత అధికారితో మాట్లాడి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్బంగా.. డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ.. రైతులు పండించిన పంట పొలాల్లోనే ఉండిపోయిందని, వాతావరణం కుడా వర్షాలు పడేట్టలు వుండాడంతో రైతులు ఆందోళన పడుతున్న పరిస్థితి వర్షం వచ్చిన దాచుకోవడానికి కనీసం సదుపాయాలు కుడా ప్రభుత్వం కలిపించలేదు. కనీసం భరకాలుకూడా లేనిపరిస్థితిలో కొంతమంది రైతులు ఉన్నారు. అదేవిధంగా చూస్తే మిషన్ తో కోసిన పచ్చిధాన్యం ఈ ప్రభుత్వం కొనడం లేదు అదేమంటే 17 పాయింట్లు ఉండాలంటున్నారు. రైతు భరోసా కేంద్రంలో 17 పాయింట్లు చూస్తే మెల్లర్ల దగ్గర 20/- పాయింట్లు వస్తుంది అంటే మూడు పాయింట్లు ఎక్కువ చూపిస్తుంది అంటే పాయింట్ కి 20/- రూపాయలు బస్తా కి 60/- రూపాయలు పోతుంది అదే 150 బస్తాలు తీసుకెళ్తే 9000 రూపాయలు అదనంగా రైతు దగ్గర నుండి తీసుకుంటున్నారు రైస్ మిల్లర్స్ లేదంటే లోడ్ దింపట్లేదు ట్రాన్స్పోర్ట్ పట్టుబడి ఖర్చులు కూడా రైతులను కట్టుకోమంటున్న ప్రభుత్వం. తక్షణమే రైతుకు ఏ ఇబ్బంది లేకుండా పచ్చి పంటను కూడా కోనాలని పంటను కాపాడుకోవడానికి బరకాలు సబ్సిడీ మీద ఇప్పించాలని, కొన్న ధాన్యానికి వారు రోజులు లోపే డబ్బులను రైతులకు ఖాతాలోకి జమ చేయాలని జనసేన పార్టీ నుండి డాక్టర్ పిల్లా శ్రీధర్ డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కందరాడ ఎంపిటిసి పిల్లా సునీత సూర్యనారాయణ, బత్తిన వీరబాబు, బిజెపి నాయకులు ముత్యాలరావు, సీనియర్ బిజెపి నాయకులు తోట ఏడుకొండలు, టౌన్ బిజెపి ప్రెసిడెంట్ పసుపురెడ్డి సత్తిబాబు, జిల్లా సెక్రెటరీ వామిశెట్టి శ్రీను, పల్నాటి మధు, గట్టెం భీమరాజు, దిబ్బిడి కృష్ణ, కేసిరెడ్డిపల్లి రాజు, పిల్లా దాసు, గుర్రం గణేష్, గుర్రం గంగాధర్, సారా శ్రీను, వాకపల్లి సూర్య ప్రకాష్, కేసిరెడ్డి దొరబాబు, మరిసే తమన్నాదొర, కటారి చంటి, మసా చన్నపుత్రయ్య, మాసా పెద్దపత్రయ, జువ్వల రామకృష్ణ, కంచర్ల కృష్ణ, మల్లవరపు నాగరాజు, పెనుపోతుల వీరబాబు, రాజు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.