సామాన్యులకు పెద్ద షాక్: జనసేన మురళి

అనంతగిరి: ఆంధ్రప్రదేశ్ లో సామాన్యుడి బతుకు భారమవుతోంది. ఓ వైపు నిత్యావసర ధరలు మండుతున్నాయి. వీటికి తోడు ఇటీవల విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచారు. ఆ బాధ నుంచి కోలుకోకముందే మరో షాక్ ఇచ్చింది ప్రభుత్వం.. ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీజిల్ రేట్లు పెరగడంతో బస్సు ఛార్జీలు తప్పని సరి పరిస్థితుల్లో పెంచుతున్నామని పల్లె వెలుగు బస్సుకు 2 రూపాయలు, ఎక్స్ ప్రెస్ బస్ పై 5 రూపాయలు, ఏసీ బస్సుకు 10 రూపాయలు ప్రకటించారు.

ప్రజల్ని మోసం చెయ్యడంలో నిపుణుడైన జగన్ మోసపు రెడ్డిని ఆర్టీసీ అధికారులు ఆదర్శంగా తీసుకున్నారు “ఒక్క అవకాశం అంటూ అభ్యర్థించి అధికారంలోకి వచ్చారు. ఈ ఏడాది కాలంలో మేక తోలు తీసేశారు. పులి స్వరూపాన్ని చూపిస్తున్నారు. అనుభవ, అవగాహన రాహిత్యం, అహంకారం, ఆత్రం, ఆంక్షలు, అవినీతి, పోలీసు రాజ్యం, రివర్స్‌ టెండరింగ్‌, కక్షసాధింపు అంశాలతోనే ఏడాది పాలన సాగించారు అని జనసేన పార్టీ మండల అధ్యక్షులు మురళి విమర్శించారు.

అధికారంలోకి రాకముందు “అవినీతి మహారాజు” అంటూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పుస్తకాలు వేసి, ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధాని, ఇతరులకు పంచి పెట్టి అధికారంలోకి వచ్చి అవినీతి డబ్బులు కక్కిస్తానన్న జగన్ ఈ సంవత్సర కాలంలో ఒక్క జే – ట్యాక్స్ తప్ప.. సామాన్యుడు కి ఒరిగింది ఏమి లేదు. ఆర్టిసి ప్రగతి చక్రం కాదు….జగన్ చట్రంలా తయారయ్యింది అని పత్రికా ముఖంగా జనసేన మురళి తీవ్రంగా విమర్శించారు.