ఘనంగా పసుపులేటి చిరంజీవి పుట్టినరోజు వేడుకలు

దర్శి నియోజకవర్గం: ప్రకాశం జిల్లా జనసేన ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి పుట్టినరోజు వేడుకలు గురువారం దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వేదుకలలో భాగంగా ముందుగా జనసేన సమక్షంలో పసుపులేటి చిరంజీవి చేత కేక్ కటింగ్ చేయించి, చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కురిచేడు మండలం అధ్యక్షులు మదా వెంకట శేషయ్య, దొనకొండ మండలం అధ్యక్షులు గుండల నాగేంద్రప్రసాద్, తాళ్లూరు మండలం అధ్యక్షులు కూటాల ప్రసాద్, దర్శి జనసేన పార్టీ ఐటి కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య, దర్శి టౌన్ ఉపాధ్యక్షులు ఎస్ కే భాష, కురిచేడు మండలం ఉపాధ్యక్షులు మంచాల నరసింహారావు, దొనకొండ టౌన్ నాయకులు బాజీ, దర్శి నియోజవర్గ నాయకులు ఉప్పు అంజి, ఉల్లి వెంకటేశ్వర్లు, ఎస్కే వెంకటేష్, రాగుల కొండలు, తోట రాయుడు, కే నాగేశ్వరరావు, వరికుటి ప్రసన్న, డి పేరయ్య, సందు రాజు, గోగు శ్రీను, గోగు రమేష్, చొప్పవరపు సాయి తేజ పాల్గొన్నారు.