సత్తెనపల్లిలో బొర్రా సుడిగాలి పర్యటన

  • పార్టీ పటిష్ఠతకు నడుం కట్టిన జనసేన సమన్వయకర్త

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లి పట్టణంలో జనసేనపార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. అందులో భాగంగా పార్టీకి దూరంగా ఉన్న అనేక మంది కార్యకర్తలను, నాయకులను కలిసి పార్టీ అభివృధ్ధి కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. చిన్న చిన్న పొరబాట్లను సరిదిద్దుకుని, ఐకమత్యంగా పనిచేసి జనసేన-తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్ధి విజయానికి కృషి చేసి, రాష్ట్రంలో జనసేన-తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిష్టించడం ఎంతైనా అవసరమని ఉధ్భోదించారు. ఈ క్రమంలో 6వ వార్డులో చల్లా గరుడ, పొట్టా చంద్రవాసు, 12వ వార్డులో గట్టు శ్రీదేవి, 22వ రామ్మోహన్ రావు తదితరుల్ని కలిశారు. ఈ కార్యక్రమంలో అప్పారావుతో పాటు పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, చిలకా పూర్ణా, సత్యం తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బొర్రా మాట్లాడుతూ.. అంబటి గారూ! 6వ వార్డు చెరువులో ఉంటున్న కొత్త కాలనీకి వారంలో మట్టి రోడ్డు వేయండి. లేదంటే జనసైనికులం మేమే వేస్తాం.
అంబటికి బొర్రా అల్టిమేటం! సత్తెనపల్లి 6వ వార్డులో
పర్యటనలో భాగంగా స్థానికంగా ఉంటున్న కొత్త కాలనీ సదర్శించిన బొర్రాకి స్థానికులు తమ సమస్యల్ని ఏకరువు పెట్టారు. వావిలాల పార్కు నిర్మాణం సమయంలో తమ గుడిశల్ని ఖాళీ చేయించి మాకెటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయకుండా, కనీసం పట్టాలు కూడా ఇవ్వకుండా మమ్మల్ని గాలికొదిలేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం వచ్చిన భీకరమైన తుఫాన్ ప్రభావంతో గుడిశెలు పూర్తిగా మునిగిపోయి, నడవడానికి దారి కూడా లేదని, పాములు నడయాడుతూ ఉన్నాయని తెలిపారు. అంబటి రాంబాబు గారిని అడిగినా, మున్సిపల్ చైర్మన్ గారిని అడిగినా పట్టించుకోవడం లేదని, “మీరు 3వ వార్డుకి చెందినవారని, 6వవార్డులో ఉంటున్నారని మాకెటువంటి సంబంధం లేదని” రెండు వార్డుల కౌన్సిలర్లు చేతులెత్తేస్తున్నారని ఆవేదన చెందారు. బాధితుల ఆవేదనతో చలించిపోయిన బొర్రా వెంకట అప్పారావు “అంబటి రాంబాబు గారు రేపల్లె నుండి వస్తే సత్తెనపల్లి ప్రజలు ఆదరించగా లేంది, 3 వార్డు నుండి 6వ వార్డుకి వచ్చిన ప్రజల్ని పట్టించుకోరా” అని ప్రశ్నించారు. ఈరోజు నుండి వారంలోగా అనగా వచ్చే ఆదివారం నాటికి ఇక్కడ మట్టి రోడ్డు వేయకపోతే మా జనసైనికులందరం కలిసి చందాలు వేసుకుని మట్టిరోడ్డు వేస్తామని అన్నారు. కాబట్టి వారంలో మట్టిరోడ్డు వేసి, ఇతర సమస్యలను తీర్చాలని అంబటికి బొర్రా అల్టిమేటం ఇచ్చారు.