“రౌడీ సేన” అనడం హేయమైన చర్య: షేక్ మహబూబ్ మస్తాన్

ఆత్మకూరు, రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నర్సాపూర్ సభలో జనసేన పార్టీని, జనసేన పార్టీ శ్రేణులను ఉద్దేశించి “రౌడీ సేన” అనడం చాలా నీచమైన హేయమైన చర్య తీవ్రంగా ఖండిస్తు ఆత్మకూరు నియోజకవర్గం జనసేన నాయకులు మరియు అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ మాట్లాడుతూ వైసీపీలో సైకోలకు, గూండాలకు, రౌడీలకు జనసేన పార్టీ “రౌడీ సేన” లాగా కనిపిస్తుంది అన్నారు.
భారతదేశ చరిత్రలోనే నీతి నిజాయితీతో బాధ్యతాయుతంగా విలువలతో రాజకీయం చేస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమే గుర్తించుకోండి. కౌలు రైతులు నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే జనసే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కష్టపడి సంపాదించిన సొంత నిధులు ప్రతి కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి జనసేన పార్టీ ఆదుకున్నందుకు? రౌడీ సేన అందామా? 30 లక్షల గృహాలు పేద ప్రజలకు నిర్మించి ఇస్తామని గొప్పలు చెప్పుకొని, ఘనమైన పబ్లిసిటీ చేసుకొని కనీసం ఇప్పటికీ లక్ష గృహాలు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఈ వాస్తవాలు ప్రజలకు తెలియజేసినందుకు రౌడీ సేన అందమా? లేక ప్రభుత్వ అధికారంలోకి వచ్చి నాటి నుంచి నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లన్నీ గుంతల మయం అయిపోయినాయి. గుంతలు పడిన రోడ్లకు మరమ్మత్తులు చేయకుండా కనీసం పిటికడు మట్టి కూడా రోడ్లోకి వేయకుండా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆ వాస్తవాలు ప్రపంచానికి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినందుకు రౌడీ సేన అందామా? రాష్ట్ర ప్రజలకు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అయోమయ, దీన, హీన పరిస్థితిలో ఉంటే వినడానికి నీకు తీరిక లేకుండా ఉన్నావు. ప్రజావాణి కార్యక్రమంలో జనవాణి ద్వారా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తెలియజేస్తుంటే అందుకు రౌడీ సేన అందామా? రాష్ట్ర ప్రభుత్వం ప్రజల బాగోగులు వినకుండా వారి సమస్యలు తీర్చకుండా ప్రజలు నిత్సాహాయిస్థితిలో విధి లేక జనసేన పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నందుకు. రౌడీ సేన అందామా? మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి రాష్ట్ర ప్రజల సంపదను వనరులు మీరు మీ పార్టీలో ఉండే నాయకులు అడ్డుగోలుగా దోచుకుంటున్నారు. అందుకు జనసేన పార్టీని రౌడీ సేన అందామా? మీ సొంత జిల్లాలో మీ వ్యక్తిగత స్వార్థ లాభ ప్రయోజనాల కోసం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి సంవత్సర కాలం పూర్తైన నిర్వాసితులకు ఇంతవరకు మీరు వాళ్లకు ఇస్తానని నష్ట పరిహారం సరైన వసతులు కల్పించలేదు. మీ సొంత నియోజకవర్గం పులివెందులలో నిస్సహాయ స్థితిలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చారు. అందుకు రౌడీ సేన అందమా? జగన్మోహన్ రెడ్డి మీరు కనీసం మీ సొంత జిల్లాకు న్యాయం చేయలేని నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నందుకు. జనసేన పార్టీ రౌడీ సేన అందామా? జగన్మోహన్ రెడ్డి మీరు గాని మీ వసిపి నాయకులు గానీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి గానీ జనసేన పార్టీ శ్రేణులు గురించి గానీ తప్పుడు మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్ అని మహా బూబ్ మస్తాన్ అన్నారు.