220 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టులకు కెనరా బ్యాంక్‌ నోటిఫికేషన్

బ్యాంకు ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త. కెనెరా బ్యాంకు పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్, డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్, బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్ లాంటి మొత్తం 220 పోస్టులున్నాయి.

పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 220

అడ్మినిస్ట్రేటర్- 4

ఎక్స్‌ట్రాక్ట్, ట్రాన్స్‌ఫామ్ అండ్ లోడ్ స్పెషలిస్ట్- 5

బీఐ స్పెషలిస్ట్- 5

యాంటీవైరస్ అడ్మినిస్ట్రేటర్- 5

నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్- 10డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్- 12

డెవలపర్ లేదా ప్రోగ్రామర్- 25

సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- 21

ఎస్ఓసీ అనలిస్ట్- 4

మేనేజర్స్ లా- 43

కాస్ట్ అకౌంటెంట్- 1

ఛార్టర్డ్ అకౌంటెంట్- 20

మేనేజర్ ఫైనాన్స్- 21

ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్- 4

ఎథికల్ హ్యాకర్స్ అండ్ పెనెట్రేషన్ టెస్టర్స్- 2

సైబర్ ఫోరెన్సిక్ అనలిస్ట్- 2

డేటా మైనింగ్ ఎక్స్‌పర్ట్- 2

OFSAA అడ్మినిస్ట్రేటర్- 2

OFSS టెక్నో ఫంక్షనల్- 5

బేస్ 25 అడ్మినిస్ట్రేటర్- 2

స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్- 4

మిడిల్‌వేర్ అడ్మినిస్ట్రేటర్- 5

డేటా అనలిస్ట్- 2

మేనేజర్- 13

సీనియర్ మేనేజర్- 1

అర్హతలు:

ఆయా పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్‌స, ఐటీ, ఎంసీఏ,ఈసీఈ, ఎల్‌ఎల్‌బీ, చార్టర్డ్ అకౌంటెన్సీ, ఎంబీఏ/ఎంఎంఎస్, బీఏ/ఎంఏ/ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ లేదా ఎకనామిక్స్ లేదా స్టాటిస్టిక్స్‌లలో 60 శాతం మార్కులు సాధించినవారు అర్హులు.

బ్యాక్‌లాగ్ పోస్టులకు ఏదైనా గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు అర్హులు. లేదా డిప్లొమా ఇన్ రిస్క్ మేనేజ్‌మెంట్/ట్రజరీ మేనేజ్‌మెంట్/ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: పోస్టును బట్టి 20 నుంచి 35 ఏళ్ల వరకు ఉండాలి.

 వేతనం:

కేటగిరీ-1 పోస్టులకు రూ.42,020

కేటగిరీ-2 పోస్టులకు రూ.45,950

కేటగిరీ-3 పోస్టులకు రూ.51,490

ఎంపిక విధానం: దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి ఆన్‌లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపినవారికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15, 2020.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ వికలాంగులకు: రూ.100

ఇతరులకు: రూ.600

ఆన్ పరీక్ష: 2021 జనవరి/ఫిబ్రవరిలో జరగవచ్చు.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://canarabank.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.