ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లలకు రక్షణ కరువు

*వైసీపీ అధికారంలోకి వచ్చాక అడపిల్లలపై, మహిళలపై అత్యాచారాలు, యాసిడ్ దాడులు పెరిగిపోయాయి.

*ఆడపిల్లలకి అన్యాయం జరిగితే గన్ కన్నా ముందే వస్తానన్న జగన్ తాడేపల్లిలో పప్జీ ఆట ఆడుకుంటున్నాడు

*మహిళా హోం మంత్రికి బడ్డి దుకాణాల ప్రారంభోత్సవాలు తప్పా శాంతిభద్రతల పరిరక్షణ అసలు పట్టదు.

*దశా, దిశా లేని దిశా యాప్ తోనే మహిళల రక్షణ అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.

*దురాఘాతాలకు కారణమవుతున్న మద్యాన్ని, మాదకద్రవ్యాలను ప్రభుత్వమే పెంచి పోషిస్తుంది.

*విజయవాడలో వేధింపులకు గురై విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై తీవ్రంగా ప్రతి స్పందించిన జనసేన వీరమహిళలు.

రాష్ట్రంలో ప్రతీరోజూ ఏదో ఒకమూల ఆడపిల్లలపై, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి…ఆడపిల్లకు అన్యాయం జరిగితే గన్ కన్నా ముందు వస్తానన్న ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలో పబ్జీ ఆడుకుంటున్నాడు…పేరుకే మహిళా హోంమంత్రిగా ఉన్న సుచరిత బడ్డీ దుకాణాల ప్రారంభోత్సవాలకే పరిమితమయ్యారు…సాక్ష్యాత్తు వైసీపీ నేతలే గంటా, అరగంట అంటూ మహిళల్ని వేధిస్తున్నారు…అసలు ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని జనసేన పార్టీ వీరమహిళలు ప్రభుత్వ అసమర్ధ పాలనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బిట్రగుంట మల్లిక , కార్పొరేటర్లు పద్మావతి, లక్ష్మీ దుర్గలు విజయవాడలో జరిగిన బాలిక ఆత్మహత్య సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళల పట్ల గౌరవం, విలువ లేకుండా పోతుందని ఇది సమాజానికి మంచిది కాదన్నారు. మహిళల పట్ల, ముక్కుపచ్చలారని బాలికల పట్ల జరుగుతున్న దారుణాలను రాజకీయ పార్టీలు తమ స్వార్ధానికి ఉపయోగించుకోవాలని చూడటం అత్యంత హేయం అన్నారు. వైసీపీ ప్రభుత్వం అసాంఘిక శక్తులకు లైసెన్స్ ఇచ్చినట్టుగా ఉందని, రాష్ట్రంలో ఆరాచకత్వం రోజురోజుకీ పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వాడికి కఠిన శిక్షలు వేయాల్సింది పోయి నిందితులు తమ పార్టీ వాడని ప్రభుత్వ పెద్దలే కాపాడుతుంటే ఇక నేరాలకు పాల్పడేవారికి భయం ఏముంటుందని విమర్శించారు. నేరాలకు, దారుణాలకు కారణమవుతున్న మద్యాన్ని, మాదకద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించాల్సిన ప్రభుత్వం కాసినో లాంటి వాటిని రాష్ట్రంలోకి తెచ్చి పరోక్షంగా ఆరాచకాలను పెంచిపోషిస్తుందని దుయ్యబట్టారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలాఖాలోనే ఆడపిల్లల పై అత్యాచారం జరిగితే ఇంతవరకు నిందుతుల్ని పట్టుకోలేని స్థితిలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉందని, పాలకులకు సలాంలు చేయటం మాని ప్రజలకు సేవ చేయాలని పోలీసులకు హితవు పలికారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, పరిపాలన చేతకాని స్థితిలో వైసీపీ ప్రభుత్వం అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతుందన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు లేనిపక్షంలో ప్రజలు వైసీపీ నేతలకు నడిరోడ్డుపై బుద్ధి చెప్పేరోజులు వస్తాయని హెచ్చరించారు. సమావేశంలో వరలక్ష్మి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.