జనసేన పార్టీపై వైకాపా నేతల అవాక్కులను ఖండించిన చిర్రి బాలరాజు

పోలవరం: సంవత్సరకాలంగా గోదావరి నీరు అందక మూడు నియోజకవర్గాల ప్రజలు, జీతాలు అందక సత్యసాయి ఉద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉద్యమాల బాటపడితే.. జనసేన పార్టీ మేమున్నాం అంటూ భరోసా కల్పించి పోలవరంలో భారీ ఉద్యమం గతంలోనే చేయడం జరిగింది.. అయినా అధికార పార్టీ స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కానీ.. స్థానిక నాయకులు కానీ.. స్పందించిన దాఖలాలు లేవు. మళ్ళీ నేడు ఇదే సమస్యపై జనసేన పార్టీ పోలవరం కేంద్రంగా భారీ ర్యాలీ.. ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గ ఇంచార్జి చిర్రి బాలరాజు మాట్లాడుతూ.. సమస్యపై స్థానిక ఎమ్మెల్యే పరిస్కారం చూపాలని లేని పక్షంలో ఇదే రోడ్డుపై నిరాహార దీక్షకు దిగుతానని స్థానిక ఎమ్మెల్యే తెల్లం బలరాజుకు సవాలు విసరడం జరిగింది. ఈ సవాలు పై స్పందించిన వైసీపీ పార్టీ మండల నాయకులు ఈ సమస్యకు ప్రభుత్వానికి సంబంధం ఏంటి ఇది ఎల్&టి సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు అని సమాధానం చెప్తున్నారు.. ఇంకొకరు మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలు ఇప్పించిన ఘనత మా ఎమ్మెల్యేది అని పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు.
ఇంకొకరు 17 కోట్లు మంజూరయ్యాయి అని చెప్తున్నారు.. ఒక్కొక్కరు పొంతన లేని సమాదానం చెప్తూ సమస్యని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప.. సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదు. లేకపోతే ఎల్&టి వారికి ఇప్పటి వరకు చెల్లింపులు చేస్తున్నది ప్రభుత్వం నుంచి కాదా అని ప్రశ్నించారు..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే ఈ చెల్లింపులు ఆగిపోయాయి అని స్పష్టం చేశారు. గోదారికి అవతలి వైపు ఇదే పథకంలో భాగంగా పురుషోత్తపట్టణంలో గోదావరి నీరు యధావిధిగా ప్రజలకు అందుబాటులో స్థానిక ఎమ్మెల్యే ఉంచగల్గినపుడు ఇది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అసమర్థత కాదా అని జనసేన పార్టీ నాయకులు చిర్రి బాలరాజు ప్రశ్నించడం తప్పా అని అన్నారు. మేము ఈ విధంగా సమస్య దృష్ట్యా.. విధానాల పరంగా మాట్లాడేతుంటే.. సమాధానాలు చెప్పలేని వైసీపీ నాయకులు పొంతనలేని సమాధానాలు చెప్తూ.. మా నాయకులని వ్యక్తిగతంగా దూషించడాన్ని పోలవరం జనసేన పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాం అని మండిపడ్డారు.