శ్రీకాళహస్తి జనసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

  • మొదటి బహుమతిగా బంగారు కమ్మలు
  • మన ఊరు మన ఆట-కార్యక్రమం-1

శ్రీకాళహస్తి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు “మన ఊరు మన ఆట” కార్యక్రమంలో భాగంగా ఈరోజు జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా శనివారం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని సి సి ఎన్ కళ్యాణ మండపం నందు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీల్లో శ్రీకాళహస్తి పట్టణం, తొట్టంబేడు మండలం నుండి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీల్లో విజేతలను నిర్ణయించే జడ్జిలుగా విజేత స్కూల్ ప్రిన్సిపాల్ ఉమా మధుకర్ సింగ్, తొట్టంబేడు గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ హేమ విచ్చేశారు. ఈ ముగ్గుల పోటీల్లో విజేతలుగా మొదటి బహుమతి పెద్ద కన్నలి కి చెందిన జి.దయాని సాధించి బంగారు కమ్మలు పొందారు. రెండవ బహుమతి శ్రీకాళహస్తి పట్టణం కి చెందిన నారాయణ గాయత్రి గారు సాధించి వెండి కుంకుమ భరిణె పొందారు. మూడవ బహుమతి శ్రీకాళహస్తి పట్టణంకి చెందిన యం.స్వరూప సాధించి మిక్సర్ గ్రైండర్ పొందారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళలకి కంటైనర్ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, పట్టణ ఇంఛార్జి తోట గణేష్, తొట్టంబేడు మండల ఇంఛార్జి పేట చంద్ర శేఖర్, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, నాయకులు రవి కుమార్ రెడ్డి, జ్యోతి రామ్, పేట చిరంజీవి, రాజ్య లక్ష్మి, కవిత, శారద, గాయత్రి, సురేష్, రాజేష్, హేమంత్, జనసైనికులు గోపి, మని, బబ్లూ, తదితరులు పాల్గొన్నారు.