కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన చిట్లు గణేశ్వరరావు

విజయనగరం, గోపాలపురంలో పేదలందరికి ఇళ్ళు అని ఇళ్ల స్థలాలు అర్హులు 29 మందికి ఇంకా ఇవ్వలేదు, కొత్తగా 32 సచివాలయంలో అప్లై చేసిన అప్లికేషన్స్ కి ఆన్లైన్ చేయలేదు. 29 ఇళ్ల స్థలాలు చాలా లోతులో గుమ్ముల్లో లెవెల్ చేసారు. ఇవ్వడానికి మట్టి కప్పకుండ అంతలోతులో ఇస్తే ఒక్కొక్కరికి పునాదులు కట్టడానికి 3 లక్షలు అవుతాయి. గ్రావెల్ వేసి లెవల్ చేసి ఇప్పించాలి అని జేసీని కోరడం జరిగింది. సంవత్సరం నుండి గోపాలపురం భూములు గోపాలపురం వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా. అర్బన్ వాళ్ళకి ఇచ్చారు. అయినా మేము ఆలోచించి ఓపికతో మీరు న్యాయం చేస్తారని చూస్తున్నాం. మాకు 10 రోజుల్లో మట్టి వేసి సైట్ క్లియర్ గా ఇవ్వకపోతే మా గోపాలపురంలో అర్బన్ వాళ్ళకి ఇచ్చిన స్థలాల్లో ఇళ్ళుకూడా కట్టుకోకుండా ఆపుతాం సార్. అనగా వెంటనే ఎంఆర్ఓ తో మాట్లాడి మట్టి వేసి ఇళ్ల స్థలాలు మరియు అర్హులకి వెంటనే ఆన్లైన్ చేసి వాళ్ళకి స్థలాలు క్లియర్ చేయాలని జేసీ తెలియజేసారు. ఎంఆర్ఓ మట్టికప్పడానికి మూడు లక్షలు రూపాయలు బిల్ పెట్టి 6నెలలు ఐనా సరే ప్రభుత్వం మంజూరు చేయలేదు. వైస్సార్ పార్టీ కార్యకమలకి కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతున్న. పేద ప్రజలకి ఇళ్ల కోసం మూడు లక్షలు లేవా. ఇంతవరకు ఎవరికీ స్థలాలు ఇవ్వలేదు. అందువలన మళ్ళీ కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందిస్తామని తెలియజేశారు.