సుపరిపాలన స్థాపనకు ఆర్థికంగా చేయూతనివ్వాలి!

  • కూటమి అభ్యర్ధి ఆనందరావుకు ఎన్‌ఆర్‌ఐ విరాళం

అమలాపురం, రాష్ట్రంలో అరాచక పాలన పోయి ఉమ్మడి కూటమి నేతృత్వంలో సుపరిపాలన స్థాపనకు అందరి సహకారం అవసరమని జనసేన పార్టీకు చెందిన ఎన్‌ఆర్‌ఐ మంచెం మైనరబాబు అన్నారు. అమలాపురం నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్ధి అయితాబత్తుల ఆనందరావుకు ఆర్థికంగా తోడ్పాటు నివ్వడం ద్వారా మరింత ముందుకు వెళ్లగలరని ఆశాభావం ఆయన వ్యక్తంచేశారు. పార్టీ విరాళంగా ఆయన తండ్రి మంచెం బాలకృష్ణ పేరుమీద రూ.50,000 చెక్కును ఆనందరావుకు అందజేశారు. ఈసందర్బంగా ఆనందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ ఈమధ్య ఈ ఎన్నికలు పెత్తందారులకు, పేదలకు మధ్య జరుగుతోన్న యుధ్ధం అని అంటున్నారని, వైసీపీ అభ్యర్ధులకు దొడ్డిదారిన ఆర్దీకంగా బలాన్ని ఇస్తూ ఈసారి ఎలాగైనా గెలవాలని కుటిల యత్నాలు వైసీపీ పాలకులు చేస్తున్నారని మండి పడ్డారు. అయితే ఈ వైసీపీ ముఖ్యమంత్రి జగన్‌ అరాచక పాలనపై విసుగెత్తిన ప్రజలు స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మైనర్ గారి లాంటి వారు పార్టీ విరాళం అందివ్వడం ద్వారా ఉమ్మడి ఊటమి ప్రభుత్వ సిద్ధాంతాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వినియోగిస్తామన్నారు. ఆయనకు ఆనందరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు లింగోలు పండు, ఇసుకపట్ల రఘుబాబు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, ఆకుల బుజ్జి, గొల్లవిల్లి పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులు గుత్తల బోసు, నల్లా వెంకటేశ్వరరావు, తెలుగుదేశం సీనియర్ నాయకులు మద్దింశెట్టి సురేష్, తెలుగుదేశం మండల అధ్యక్షులు ఆరిగెల నానాజీ, అరిగెల నరేష్ పాల్గొన్నారు.