క్లాప్ ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరం: వాసగిరి మణికంఠ

అనంతపురం జిల్లా, గుంతకల్ పట్టణం స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర 5 నెలలుగా జీతాలు రాకపోవడం వలన
“క్లాప్ ఆటో డ్రైవర్లు” 6 రోజులుగా చేస్తున్న సామూహిక దీక్షలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, జనసైనికులు సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పథకం కింద పారిశుద్ధ సమస్యను పరిష్కరించేందుకు 6500 ఆటోలు తీసుకున్నామని భారీ ఓపెనింగ్స్ తో వైసీపీ నాయకులు ప్రగల్బాల్ అయితే పలికారు గానీ, ఆ ఆటోలు నడిపే డ్రైవర్లకు మాత్రం ప్రభుత్వము నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో ఆకలి మంటలతో ఆ కార్మికులు రోడ్డున పడ్డారు. వైసిపి ప్రభుత్వం చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం 18,500 ఇవ్వకపోగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెడ్డి ఎంటర్ప్రైజెస్ గుత్తెందారు సంస్థ క్లాప్ ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న 10600 జీతభత్యం కూడా ఆరు నెలలుగా ఇవ్వకపోగా ముఖ్యంగా పీఎఫ్, ఈఎస్ఐ అకౌంట్లు కూడా తెరవకుండా కనీస ఉద్యోగ భద్రత కూడా లేకుండా చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. “మే డే” రోజున మాత్రం ఫోటోకు ఫోజులిచ్చి పెద్ద పెద్ద జగనన్న హోర్డింగ్స్ వేసుకోవడం కాదు కార్మికుల సంక్షేమం అంటే కార్మికుడు, కర్షకుడు ఏరోజైతే పనికి తగ్గ వేతనాన్ని తీసుకుంటాడో అదే అసలైన “మేడే” అని ఆయన ఉద్ఘాటించాడు. ప్రధానంగా గుంతకల్ పట్టణంలో క్లాప్ ఆటో డ్రైవర్లు ఆరు రోజులుగా సామూహిక దీక్షలు చేస్తున్న జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన మా గౌరవ శాసనసభ్యులు వెంకటరామిరెడ్డి పట్టించుకోకపోవడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. మీ భారీ మెజార్టీకి కారణమైన కార్మికుల ఆకలి నినాదాలు ఇప్పటికైనా విని వీరి సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. క్లాప్ ఆటో డ్రైవర్లు నిర్వహించే ఏ న్యాయ పోరాటానికైనా జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని. ఈ విషయాన్ని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఆటో డ్రైవర్లు, గుంతకల్ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్ సీనియర్ నాయకులు గాజుల రాఘవేంద్ర, కసాపురం వంశీ, అమర్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.