మంచి నాయకులతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యం

  • రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడుకుందాం
  • జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
  • జాతీయ జెండాను ఆవిష్కరించిన ముస్లిం మతపెద్దలు హిమాయత్ అలీ, కార్మిక సంఘ నేత సోమి శంకరరావు

గుంటూరు: ప్రజలు మంచి నాయకుల్ని ఎన్నుకున్నప్పుడే దేశం మరింత బలంగా ముందుకు వెళ్తుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక 22 వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో స్థానిక ముస్లిం పెద్దలు హిమాయత్ ఆలీ, రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు సోమి శంకరరావులతో కలిసి ఆయన శ్రీనివాసరావుతోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగ ఫలమైన స్వాతంత్ర్య భారతదేశాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. భవిష్యత్ తరాల వారు ఎవరికీ బానిసలుగా ఉండకూడదని, తమ హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎందరో ప్రాణత్యాగం చేసి ఈ స్వంతత్ర్యాన్ని తీసుకువచ్చారన్నారు. మనం కూడా సమాజంలో ఉత్తమ పౌరులుగా, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహించినప్పుడే త్యాగధనుల త్యాగానికి విలువ పెరుగుతుందన్నారు. సమాజాన్ని, ప్రజల జీవన విధానాన్ని, దేశ భవిష్యత్తును నిర్ణయించే రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో రెల్లి యువనేత సోమి ఉదయ్, షేక్ నాగూర్, కొలసాని బాలకృష్ణ, రోశయ్య, షేక్ గౌస్, నండూరి స్వామి, కాసులు, రాజశేఖర్, బాలు, పూసల శ్రీను, నన్నే భాయ్, చంటి, నరసింహ, శెట్టి శ్రీను, కోలా మల్లి, బాలాజీ, హేమంత్, నాజర్ వలి, బాలు, సాయి, అభినయ్, మునగ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.