జాతీయ సినీ పురస్కార విజేతలకు అభినందనలు

68వ జాతీయస్థాయి చలన చిత్ర పురస్కార విజేతలకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ దఫా పురస్కారాల్లో ఎక్కువ శాతం దక్షిణ భారత చిత్రసీమ నుంచి వచ్చిన చిత్రాలు దక్కించుకోవడం సంతోషించదగ్గ పరిణామం. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్.ఎస్.తమన్ (అల వైకుంఠపురం), ఉత్తమ కొరియోగ్రఫీ శ్రీమతి సంధ్యా రాజు (నాట్యం), ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ శ్రీ టి.వి.రాంబాబు (నాట్యం), ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’ పురస్కారాలు కైవసం చేసుకొన్నందుకు ఆనందంగా ఉంది. వీరందరికీ నా అభినందనలు. ఈ స్ఫూర్తితో వీరి నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.