ఓట‌మి భ‌యంతోనే జ‌న‌సేన‌-టీడీపీ కూట‌మిపై విమ‌ర్శ‌లు

  • దింపుడుక‌ల్లెం ఆశ‌తో పొత్తుల‌పై వైసీపీ కుట్ర‌లు
  • ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తును బంగారుమ‌యం చేయ‌టానికి సుస్ప‌ష్ట‌మైన వ్యూహంతో ముందుకు
  • ఉమ్మ‌డి అభ్య‌ర్ధి ప్ర‌త్తిపాటి పుల్లారావును అఖండ‌మెజార్టీతో గెలిపించుకుంటాం
  • జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజీ

చిల‌క‌లూరిపేట‌: జ‌న‌సేన‌-టీడీపీ ఉమ్మ‌డి ఎజెండాతో ముందుకు వెళుతున్నాయ‌ని, పొత్తుల ప‌ట్ల‌, సీట్ల ప‌ట్ల భ‌విష్య‌త్తు కార్య‌చ‌ర‌ణ‌ప‌ట్ల స్ప‌ష్ట‌మైన విధానం ఉంద‌ని, ఈ పొత్తులు, కూట‌మిపై విమ‌ర్శ‌లు చేసే వైఎస్సార్ సీపీ నాయ‌కులు అంథోపాతానికి దిగ‌జారుతున్న త‌మ‌ పార్టీ ప్ర‌తిష్ట‌పై దృష్టి సారిస్తే మంచిద‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజీ చెప్పారు. శ‌నివారం ఆయ‌న కార్యాల‌యంలో విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు. ముందుగా జ‌న‌సేన‌-టీడీపీ ఉమ్మ‌డి అభ్య‌ర్ధిగా ప్ర‌త్తిపాటి పుల్లారావును ప్ర‌క‌టించ‌టం ప‌ట్ల ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. చిల‌క‌లూరిపేట నుంచి ప్ర‌త్తిపాటి పుల్లారావును అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామ‌ని, ఉమ్మ‌డిగా ఎంపికైన ప్ర‌త్తిపాటి పుల్లారావుకు శుభాకాంక్ష‌లు తెలిపారు.
జ‌న‌సేన‌-టీడీపీ క‌లిస్తే త‌మ పార్టీకి పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌ని, ప్ర‌జా క్షేత్రంలో గెల‌వ‌డం క‌ష్టం కాబ‌ట్టే ప్ర‌తి రోజూ వైఎస్సార్ సీపి నాయ‌కులు బురద‌జ‌ల్లుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఓట‌మి ఖ‌రారైన వైఎస్సార్ సీపీ నాయ‌కులు కూట‌మి పొత్తులు విఫ‌ల‌మ‌వ్వాల‌ని దింపుడు క‌ల్లెం ఆశ‌తో ప్ర‌తి రోజూ కుటిల ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని మండి ప‌డ్డారు. భ‌విష్య‌త్తు ఏమిటో వైఎస్సార్ సీపీ నాయ‌కుల‌కు క‌ళ్ల‌కు క‌న‌బ‌డుతుంద‌ని, ఓట‌మి పొందుతున్నామ‌న్న ఆందోళ‌న‌లో ప‌చ్చి ప్ర‌గ‌ల్బాలు ప‌లుకుతున్నార‌ని ఎద్దెవా చేశారు. 24 సీట్లే ఇచ్చారని ఏద్దేవా చేస్తున్న వైస్సార్సీపీ రాబోయే ఎలక్షన్ లో 24 సీట్లు కూడా గెలుపొందలేరని ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది జ‌న‌సేన‌-టీడీపీ కూట‌మి అని తెలిసి వైఎస్సార్ సీపీ నుంచి ఎంతో మంది నాయ‌కులు, ఎమ్మెల్యేలు పార్టీ వీడి పోతున్నార‌ని, ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ వైఎస్సార్ సీపీలో పెరిగిన విభేదాలు, కుమ్ములాట‌లు పెరిగి పోయాయ‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల త‌రుణంలో ప‌త‌నావ‌స్థ‌లో ఉన్న పార్టీ స‌రిచేసుకోవాల్సిన వైఎస్సార్ సీపీ నాయ‌కులు ప‌క్క పార్టీలో లోపాలు చూడ‌టం అంటే వారి మాన‌సిక స్థితి ఏలా ఉందో అర్ధం అవుతుంద‌న్నారు. సుస్ప‌ష్ట‌మైన కార్యాచ‌ర‌ణ‌తో ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తును బంగారుమ‌యం చేయ‌టానికి జ‌న‌సేన‌-టీడీపీ ముందుకు సాగుతున్నాయ‌ని, ప్ర‌జ‌ల మ‌న్న‌ల‌తో, ఆశీస్సుల‌తో కుట‌మి ఘ‌న విజ‌యం సాధించి అధికారం చేప‌ట్ట‌బోతుంద‌ని వెల్ల‌డించారు.