జనసేన పార్టీ పల్లెబాట కార్యక్రమం 6వ రోజు

పర్చూరు, చిన్నగంజాం మండలం, గొనాసపుడి గ్రామంలో జనసేన పార్టీ పల్లెబాట కార్యక్రమం 6వ రోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ మరియు పర్చూరు యువ నాయకులు మరియు మన్యం శ్రీకాంత్ ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ గారిని 2024లో ముఖ్యమంత్రిని చేయాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయదం జరిగింది. ఈ ప్రచారం చేసే క్రమంలో మహిళలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకసారి మాట్లాడడం జరిగింది. ప్రకాశం జిల్లా వలస కార్మికుల గురించి నాలాగ వెళ్లి ఎంతోమంది వలస కార్మికుల గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇంటింటికి వెళ్లే క్రమంలో ప్రజలు ఆదరిస్తున్న ఆదరణలో ఈసారి కచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం విశేషం. గొనసపుడీ గ్రామంలో మొదటిగా ఆంజనేయ స్వామి వారి విగ్రహం వేసి తదనంతరం అంబేద్కర్ నగర్ కు వెళ్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు ప్రభుత్వం చేయలేని పనులు కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ కార్యక్రమం చిన్నగంజాం మండల అధ్యక్షులు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి శంకర్ శెట్టి చిరంజీవి, సంయుక్త కార్యదర్శి షేక్ ఇంతియాజ్ ప్రోగ్రామ్స్ కమిటీ మెంబర్ సతీష్, అశోక్ కారంచేడు మండల అధ్యక్షుడు సాగర శ్రీనివాస్ రావు, ఇంకొల్లు మండల అధ్యక్షులు నారిశెట్టి ప్రవీణ్ కుమార్, యద్దనపూడి మండలం అధ్యక్షులు గనిపిశెట్టి అయ్యప్ప స్థానిక నాయకులు బొప్పన సాయి, రామిశెట్టి దేవ ఇంటింటికి తిరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ పవనన్న చేనేత బాట చేస్తున్న కిరణ్ తేజ్, తోట అశోక చక్రవర్తి, అడుసుమల్లి హరిబాబు, చెరుకూరు లక్ష్మణ్, పరుచూరి వెంకటేష్, కొప్పల మహేష్, పసుపులేటి రవికాంత్ పసుపులేటి సాయి తదితరులు పాల్గొన్నారు.