జనసేన పోరుబాట 8వ రోజు

ఏలూరు, స్ధానిక 6వ డివిజన్ సుంకర వారి తోట, గాయత్రి కాలనీ, బ్రహ్మం గారి గుడి ఏరియాలో రెడ్డి అప్పల నాయుడు పాదయాత్ర ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అధికార పీఠం దక్కించుకున్న వెంటనే ప్రజల నెత్తి మీద గుదిబండ అనే భారాన్ని మోపి అవకాశం ఇచ్చిన ప్రజలను నమ్మించి మోసం చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించడానికి ఎన్నికలు వస్తాయో అని ఎదురు చూస్తున్న ప్రజలు ఇప్పటికీ పెరిగిన నిత్యావసరాల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు, విద్యుత్ ఛార్జీలు,అధిక భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై మోపుతున్నారు అని అలాగే విద్యుత్ ఛార్జీలు పెంపు చూపించి సంక్షేమ పథకాలు ఆపేయడం లబ్ధిదారులకు అందకుండా చేయడం రైతులను నిలువునా ముంచి సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా కొనుగోలు చేసిన ధాన్యం డబ్బును ఖాతాలో జమ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రెడ్డి అప్పల నాయుడు మండిపడ్డారు. అనంతరం సుంకర వారి తోటలోని రైస్ మిల్లు ప్రాంతంలో జనసేన పార్టీ జెండా స్థూపం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బొద్దపు గోవిందు, దోసపర్తి రాజు, బుధ్ధా నాగేశ్వరరావు, పడాల రాజు, కోలా అప్పారావు, మాకరబోయిన పండు, కోలా శివ, హరీశ్, బొద్దపు కన్న, బొద్దపు కుమార్, చిన్ని అన్నవరం, మల్లేష్, బుజ్జి, శివ, మురళి, రాయి నూకరాజు, దుర్గారావు, నాయుడు, కోలా రాంబాబు, బాలు, పత్తి రాంబాబు, కోలా నాగేశ్వరరావు, సి.హెచ్.రమేష్, చిన్ని శివ, సుజాత, ఉమామహేశ్వరి, కోలా దుర్గా మరియు జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.