పొన్నలూరులో ఎస్టీ కాలనీని అభివృద్ధి చేయండి: కనపర్తి మనోజ్ కుమార్

  • ఎస్టీలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది
  • ఎస్టీ కాలనీలో కనపర్తి మనోజ్ కుమార్ పర్యటన

కొండపి నియోజకవర్గం: పొన్నలూరు జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆదివారం పొన్నలూరు మండలంలో ఎస్టీ కాలనీలో పర్యటించి, ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సీసీ రోడ్లు లేవు, సైడ్ కాలువలు లేవు, స్తంభాలకు వీధి దీపాలు లేవు, మురికి నీరు నిల్వ ఉండి ప్రజలకు ఎన్నో రకాల వ్యాధులు కూడా వస్తున్నాయి. సర్పంచ్ కానీ, అధికారులు కానీ, వైసీపీ నాయకులు కానీ పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎస్టీ కాలనీ ప్రజలందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుంది, అతి తొందరలో ఎస్టీ కాలనీ సమస్యలను అధికారుల దృష్టికి జనసేన పార్టీ తీసుకెళ్తుంది. సిసి రోడ్లు, సైడు కాలువలు వేసే విధంగా అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చి ఎస్టీ కాలనీ అభివృద్ధి చెందే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తుంది. ఈ కార్యక్రమంలో పిల్లిపోగు పీటర్, పెయ్యల రవి, సుబ్రమణ్యం నాయుడు, ఖాదర్ భాషా, సాయి, శ్రీను, లక్ష్మణ్ , మహబూబ్ బాషా, భార్గవ్, తిరుమలరెడ్డి పాల్గొన్నారు.