వరద బాదితులకు జనసేన పార్టీ హెల్పింగ్ హాండ్స్ పులిహోర పొట్లాల పంపిణీ

  • పులిహోర పంచిన వారిని అభినందించిన బండారు శ్రీనివాస్

అంబేద్కర్ కోనసీమజిల్లా, కొత్తపేట నియోజకవర్గం, జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ వరద ముంపు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. కొన్ని రోజుల క్రితం వచ్చిన వరదలు తగ్గుముఖం పట్టడంతో, ఆ గ్రామాలలో ఉన్న వారికి సహాయర్థంగా జనసేనాని పిలుపుపై పలువురు యువత సహకారాలు అందించడం ఎంతో సంతోషం అని తెలియజేస్తూ, రెండు రోజుల నుంచి గోదావరి వరద పూర్తిగా తగ్గుముఖం పట్టడం, ప్రజలు ఇళ్లకు చేరడం, మూలంగా బడుగు వానిలంక పరిసర గ్రామాలలోని ప్రజల ఇబ్బందులను గమనించి, వారికి అండదండలు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా కలవచర్ల గ్రామంలోని జనసేన పార్టీ హెల్పింగ్ హాండ్స్ యూత్ సభ్యులు, సుమారు 4000 ఆహార పొట్లాలను తమ సొంత ఖర్చులతో తయారు చేయించి, బడుగువాని లంక వరద ప్రాంతాల్లో గ్రామస్తులకు, గ్రామములో ప్రతి వీధికి తిరిగి పంచిపెట్టడం ఎంతో సంతోషంగా ఉన్నదని, యూత్ వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ తెలియజేశారు. జనసైనికులలోను, యూత్ లోను, గోదావరి వరదలకు సహాయ సహకారాలు అందించి వారికి అండదండలుగా ఉండాలని జనసైనికులను, జనసేనాని కోరడం, వారు వెంటనే స్పందించి, లంక గోదావరి వరద ప్రాంతాలలో సభ్యులు చేస్తున్న కృషిని బండారు శ్రీనివాస్ అభినందించారు. మొన్న జనసేనాని ఇచ్చిన పిలుపుపై అనేక గ్రామాల్లో ఉన్న జనసైనికులు లంక గ్రామాల్లో పర్యటిస్తూ నిరంతరం సేవలు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఎంతో ఘనంగా తెలుపుతున్నానని ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ తెలియజేశారు.