కార్మికులకు 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి: దారం అనిత

చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యాదర్శి దారం అనిత మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా కార్మిక వర్గాలు సాధించుకున్న 8 గంటల పని దినాన్ని కార్పొరేట్ సంస్థల కోసం 12 గంటలకు మార్చడం చాలా శోచనీయం. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి.. దీంతో కార్మికులకు పనిభారం కార్మికులకు వేతనాలు తగ్గించడంతోపాటు పారిశ్రామిక సంబంధాలకు విఘాతం కలుగుతుంది.. దీన్ని వెంటనే సంహరించుకునే విధంగా ప్రభుత్వం వ్యతిరేకించాలని జనసేన పార్టీ తరఫున దారం అనిత డిమాండ్ చేశారు.