చట్టం వైసీపీకి చుట్టమా?: శోభన్ బాబు

  • ఐపీసీ సెక్షన్ లు వైసీపీకి వర్తించవా?
  • ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే జనసేన పార్టీ లక్ష్యం

గంగాధర నెల్లూరు, 2020 జూన్ 17వ తేదీ కార్వేటి నగరం మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆఫీస్ ముందర జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న ఇళ్ల పథకంలో కార్వేటి నగర మండలం పంచాయతీలో బంగ్లాలో ఉన్న వాళ్లకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కాకుండా నిజమైన లబ్ధిదారులకు, నిరుపేదలైన ప్రజలకు జగనన్న ఇళ్ల పథకంలో ఇళ్లను మంజూరు చేయాలని రెండు రోజుల నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. మనిషికి మనిషికి ఆరడుగుల దూరం, మాస్కులు ధరించి, శానిటైజర్ ఉపయోగించి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిరసన దీక్ష చేయడం జరిగింది. మరుసటి రోజు అదే కార్వేటి నగరం మండలంలో వైసీపీ నాయకులు 500 మందితో ఒక సభను ఏర్పాటు చేశారు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు, మరి వైసీపీ నాయకుల మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు. ఇది మా ప్రశ్న? కానీ జనసేన నాయకుల మీద మాత్రం అక్రమ కేసు పెట్టారు అప్పటినుంచి (రెండు సంవత్సరాల ఐదు నెలలు) వాయిదాలకు వెళుతూనే ఉన్నాం. అయినా ప్రజా సమస్యల మీద పోరాడినందుకు ప్రజల పక్షాన గొంతును వినిపించినందుకు మేము గర్వపడుతున్నాం. కేసులకు ఎప్పటికీ భయపడం, బెదరం, అదరం, మా ప్రయాణం సాగిస్తాం. జనసేన నాయకులు మీద అక్రమ కేసులు బనాయించి ప్రజల గొంతుగా తన గొంతును వినిపిస్తున్న జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న గొంతును నొక్కాలని ఎందుకు చూస్తున్నారు. బైండోవర్ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డాక్టర్ యుగంధర్ పొన్న మీద 10 కేసులు అక్రమ కేసులు బనాయించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నాయకుల మీద రెండు నుంచి మూడు కేసుల వరకు అక్రమ కేసులు బనాయించారు. మాట్లాడితే కేసులు, వాట్సాప్ స్టేటస్ పెడితే కేసులు, ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే కేసులు, దగ్గినా కేసులు, తుమ్మినా కేసులు మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ప్రజల పక్షాన మా పోరాటం ఆగదు. అక్రమ కేసులు పెట్టాడన్ని జనసేన పార్టీ తరపున ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే జనసేన పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టిన మాకు న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం ఉంది, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం ఖాయం, డా యుగంధర్ పొన్న గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం. మా అధినేత పవన్ కళ్యాణ్ భావితరాలకు భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చారు. ప్రజల ప్రక్షాణ ఉగ్ర నరసింహడై పోరాడుతున్న ఒకే ఒక్క ధీరుడు మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన విజయడంకా మోగిస్తుంది జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు ధర్మం కోసం ఒక యుగపురుషుడు వస్తాడు ఆ యుగపురుషుడే పవన్ కళ్యాణ్ అని అన్నారు.