జక్కా వాసుదేవరావుకు అండగానిలచిన డా. మూగి శ్రీనివాసరావు

విశాఖపట్నం, దక్షిణ నియోజకవర్గం 36వ వార్డు జనసైనికులు జక్కా వాసుదేవరావు జనవరి 26న అనుకోని ప్రమాదానికి గురై, ప్రమాదంలో కుడిచేయ్యి విరిగిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు డా.మూగి శ్రీనివాసరావు వాసుదేవరావును హాస్పిటల్ లో జాయిన్ చేసి ప్రతిరోజు యోగక్షేమలు తెలుసుకొని, నేను ఉన్నాను అని భరోసా ఇస్తూ వారి కుటుంబసభ్యులకు, దైర్యం ఇచ్చారు. అదేవిధంగా గురువారం వాసుదేవరావును డిశ్చార్జ్ చేసే సమయంలో హాస్పిటల్ కి వెళ్ళి దగ్గరవుండి ఇంటికి తీసుకోని వెళ్ళి 10,000/-రూపాయలు నగదు వారి కుటుంబసభ్యులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ నాపై చూపించిన మీ ప్రేమకి, నేను మీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు అంటూ.. నా తరుపున నా కుటుంబ సభ్యులు తరుపున మూగి శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపి, మీలాంటి నాయకులు ఆపదలో ఉన్న జనసైనికులకు ఏ ఆపద వచ్చినా, నేను ఉన్నాను అని మీరు ముందుకొచ్చి నిలబడి ఆ జనసైనికులకు దైర్యం ఇవ్వాలి కోరుకుంటున్నానని తెలియజేసారు.