దుర్గామాత అన్న సంతర్పణలో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, రాపర్తి గ్రామం నందు ఏర్పాటు చేసినటువంటి దుర్గామాత అమ్మవారి అన్నసంతర్పణ కార్యక్రమంలో భాగంగా కమిటీ వారి ఆహ్వానం మేరకు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ అమ్మవారిని దర్శించుకుని అన్న సంతర్పణ కార్యక్రమం నిమిత్తం అమ్మవారికి 2116/- రూపాయలు విరాళంగా అందించి అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరాంరెడ్డి అమర్, ఎక్స్ సర్పంచ్ గరగా సత్యనందరావు, దుడ్డు నాగు, దుడ్డు రాంబాబు, బొజ్జ గోపికృష్ణ, ఇంటి వీరబాబు, కీర్తి చంటి, ముప్పిడి నారాయణ రెడ్డి, సుబ్రహ్మణ్యం మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.