తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి బుధవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. బిజెపీ పొత్తుతో తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది. ఉమ్మడి అభ్యర్థుల తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. 22, 23 తేదీల్లో పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకల్లో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొంటారు.

Image