జనసేన నేతల అక్రమ అరెస్టును ఖండిస్తూ ఏలూరు జనసేన నిరసన

ఏలూరు, విశాఖపట్నంలో శనివారం రాత్రి జరిగిన జనసేన పార్టీ నాయకుల అక్రమ అరెస్టు నిరసనగా ఆదివారం ఏలూరు నియోజకవర్గంలోని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి పాతబస్టాండ్ వరకు భారీ సంఖ్యలో ర్యాలీగా వెళ్లి నిరశన వ్యక్తం చేసి అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ మోహన్ రెడ్డికి మంచి బుద్ధిని ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు. ఒకప్పుడు ప్రాంతాల మధ్యలో చిచ్చు రేపకూడదని అమరావతి రాజధానికి ఒప్పుకొని నేడు ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి మూడు రాజధానుల ప్రతిపాదన డ్రామా అని లేవనెత్తారు. శనివారం జరిగిన విశాఖ గర్జన అట్టర్ ఫ్లాప్ కావడంతో దానికి విరుద్ధంగా జనసేన నాయకులు దాడి చేశారని, వారిపై కోడికత్తి డ్రామా లాగానే సొంత కార్యకర్తలతో డ్రామాలాడి జనసేన కార్యకర్తలపై నెట్టి వేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన అనే కార్యక్రమం పెట్టి పూర్తిగా రాజకీయ వేదికగా మార్చేశారని రెడ్డి అప్పల నాయుడు ధ్వజమెత్తారు. వేదిక మీద ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తులు ఎవరు కనబడలేదు అంతా రాయలసీమకు చెందిన వ్యక్తులే ఉన్నారని ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు అందరూ మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉన్నారని ఈ గర్జనతో స్పష్టంగా అర్ధంఅయ్యిందని రెడ్డి అప్పల నాయుడు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి జరిగే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, నగర ఉపాధ్యక్షుడు బొత్స మధు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, కార్యవర్గ సభ్యులు బోండా రాము నాయుడు, నాయకులు సుందరనీడి ప్రసాద్, నిమ్మల శ్రీనివాసు, కందుకూరి ఈశ్వరరావు, పైడి లక్ష్మణరావు, బుధ్ధా నాగేశ్వరరావు, చీమల గోపి, సురేష్, శివ చైతన్య, శివశంకర్, దుర్గా ప్రసాద్, వీర మహిళలు కావూరి వాణిశ్రీ, సరళ, దుర్గా బి, ఉమాదుర్గ, సుజాత తదితరులు పాల్గొన్నారు.