గిరిజన స్మశాన వాటికలో శవాలపై పేలాలు ఏరుకుంటున్న కబ్జాదారులు

గతంలో జనసేన పార్టీ పాత సింగరాయకొండ గ్రామపంచాయతీలో గిరిజనులకు కేటాయించిన స్మశాన వాటిక కబ్జాకు గురైన విషయం ప్రజలందరికీ తెలిసినదే. నాడు జనసేన పార్టీ స్పందించి కబ్జా కు గురైన గిరిజనుల స్మశాన వాటికను తిరిగి స్మశాన వాటికను వారికి కేటాయించాలనీ నాడు సింగరాయకొండ మండల తహసిల్దార్ కి జనసేన పార్టీ నుండి వినతి పత్రం ఇవ్వటం జరిగినది. కానీ రోజు రోజుకీ ప్రభుత్వ భూములు కబ్జాలు చేయటం వైసీపీ నాయకుల అండదండలతోమితిమీరి నాడు ప్రభుత్వ గిరిజన స్మశాన వాటిక ఆక్రమించడమే కాకుండా, నేడు ప్రశ్నించిన వారిపై అక్రమంగా కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగినది. దీని పై సంబంధిత సింగరాయకొండ మండల తాహసిల్దార్ని కలిసి గిరిజనులకు కేటాయించిన స్మశాన వాటిక పై ఎటువంటి చర్యలు తీసుకున్నారు అని అడగగా, అది ప్రభుత్వ భూమి అని దానికి సంబంధించిన టువంటి నకలు కూడా కోర్టుకి ఇచ్చామని తెలియపరచుగా, వాటి నకలను కూడా మాకు ఇవ్వమని కోరడమైనది. ఈ వైసీపీ ప్రభుత్వం అండదండలతో నీతిమాలిన చర్యల కు పాల్పడినట్లయితే ఎంతటి వారైనా రాబోయే రోజుల్లో చట్ట ప్రకారం భారీ మూల్యం చెల్లించక తప్పదు. అదేవిధంగా నాడు గిరిజనులకు కేటాయించిన స్మశాన వాటికపై స్పందించినవటువంటి గిరిజన నాయకులు పై కూడా మరియు ప్రభుత్వ అధికారులు పై కూడా ప్రభుత్వ భూమి కబ్జా చేయడమే కాకుండా, ప్రశ్నించిన వారికి నోటీసులు పంపించటం ఈ వైసీపీ ప్రభుత్వ నాయకులకు చెంపపెట్టు అని ప్రజలు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, మరియు గిరిజన నాయకులు పొట్లూరి లక్ష్మయ్య, వారి బృందం పాల్గొన్నారు.