సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం హర్షనీయం!: బండారు శ్రీనివాస్

*చనిపోయిన కౌలు రైతుల బిడ్డల భవిష్యత్తుకు, ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం ఎంతో హర్షనీయం!: బండారు శ్రీనివాస్

కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంగళవారం అనంతపురం జిల్లాలో జనసేనాని పర్యటించారని, ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పలువురు కౌలు రైతు కుటుంబాలను కలిసి వారి కష్టాలను పంచుకున్నారని, తెలియజేస్తూ.. ఆర్థిక ఇబ్బందులతో తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభించడం, కొన్ని కుటుంబాలను కలిసి వారి బిడ్డలను ఓదారుస్తూ, వారి కుటుంబ సభ్యులను జనసేనాని పరామర్శ చేసి, అండదండలు అందించడం ఎంతో గొప్ప విషయమని, అధికారం లేకపోయినా కూడా ప్రజలను కంటికి రెప్పలాగా వారి కోసం పోరాడే నాయకుడు వచ్చాడని, ప్రజల కష్టసుఖాల్లో నిరంతరం కులమతాలకు అతీతంగా, పాలుపంచుకుంటున్న ఒక గొప్ప నాయకుడిగా..రేపటి తరానికి చరిత్రలో నిలిచి పోయే విధంగా..ఆ కౌలురైతుల కుటుంబాల్లో.. చదువుకునే వారి బిడ్డలకు భవిష్యత్తుకు.. ఒక ప్రత్యేకమైన సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం..ఆ బిడ్డల జీవితాలకు వెలుగులు తీర్చిదిద్దాలనే.. గొప్ప ఆశయం ఎంతో హర్షణీయం! ఒక మానవత్వ విలువలతో కూడిన గొప్ప విషయం! ఇలాంటి మంచి మనసు ఎంత మంది నాయకుల్లో ఉంటుందని.. పలువురు ఎంతో అభినందిస్తూ జనసేనాని ముందుకు ఉత్సాహంగా వెళ్లాలని దీవిస్తూ ఉన్నారని.. మా కొత్తపేట నియోజకవర్గంలోని ప్రతీ చోట జనసేనానికి పాలాభిషేకం ఎంతో గొప్పగా చేశారని.. కొత్తపేట నియోజకవర్గం ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు, కౌలు రైతు కుటుంబాలను ఆదుకునేందుకు జైత్రయాత్ర మొదలుపెట్టిన జనసేనానికి కృతజ్ఞతలు అని, హర్షం వ్యక్తం చేశారు.