మదనపల్లెలో పన్నుల పేరిట పేద ప్రజల నుండి దోపిడి..

పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు ఒక వైపు.. మరోవైపు పెంచిన ఆస్తిపన్ను నిత్యవసర వస్తువులు ధరలతో ప్రజల ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే పుండు పై కారం చల్లినట్టు యూజర్ చార్జీలు(చెత్త పన్ను) మోగుతున్నాయి. ఇప్పటికే అనూహ్యంగా పెంచిన ఆస్తిపన్ను నీటి పన్ను చెల్లించే ఆర్థిక స్తోమత లేని పేద ప్రజలు క్లాప్ పథకం అమలుపై పెదవి విరుస్తున్నారు.

త్వరలోనే మదనపల్లి పురపాలక సంఘం పరిధిలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ పథకం కింద చెత్త పన్ను వసూలు చేయడానికి 33 వాహనాలను సిద్ధం చేశారు. మదనపల్లి పురపాలక సంఘం పరిధిలో 35వ వార్డులో అధికారుల లెక్కల ప్రకారం 30 వేల ఇళ్లు ఉన్నాయి. ఇందులో అధికారికంగా 1,35, 639 మంది జనాభా ఉండగా అనధికారికంగా 1.70 లక్షలు పైబడి ఉండొచ్చని అంచనా. ఇందులో 42 మురికివాడలు ఉండగా 60 వేల పైచిలుకు జనాభా ఉన్నారు. నివాస గృహాలు, నివాసేతర, వ్యాపార భవనాలు, మురికివాడలుగా పురపాలక సంఘం అధికారులు ఇప్పటికే నోటిఫై చేసారు. పురపాలక సంఘం చెత్తను తరలించడానికి వాహనాలు సిద్ధం చేసింది. ఏ క్షణంలో అయినా ఈ పథకాన్ని అమలు చేయవచ్చు. దీంతో నెలకు 60 రూపాయలు.. స్లమ్ కేటగిరికి 30 రూపాయలు ధర నిర్ణయించగా దీన్ని సవరించి 100 రూపాయలు.. 50 రూపాయలు చేశారు.

పెంచిన ధరలు పన్నులతో పేద ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతుంటే.. తాజాగా ఈ చెత్త వేయడం చాలా అన్యాయం. నెలకు 35 లక్షలు వసూలు చేయడానికి పురపాలక సంఘం రంగం సిద్ధం చేయడం చాలా దుర్మార్గ కరమైన చర్య.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత డిమాండ్ చేయడం జరిగింది.