జయరాం రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా జనసేన 20వ రోజు

అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా జనసేన కార్యక్రమంలో భాగంగా, అనంతపురం నియోజకవర్గంలో “నా సేన కోసం – నా వంతు” కార్యక్రమ ఆవశ్యకతను తెలియజేసి 4వ రోజు పిటిసి గ్రౌండ్స్ నందు పుర ప్రజలతో మమేకమై, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో ఆ ఆశయాలను వివరిస్తూ, స్థానిక ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, పాలగిరి చరణ్ తేజ, మెరుగు శ్రీనివాస్, ఊటకూరి జయ కృష్ణ, ఎల్లుట్ల మంజునాథ్, ప్రవీణ్ కుమార్ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.