జనసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

ప్రకాశం జిల్లా, చీరాల నియోజకవర్గంలో ఓడరేవు గ్రామ జనసేన పార్టీ మరియు కృతి ఫౌండేషన్ తెనాలి నేత్రాలయ ఐకేర్ వారి ఆధ్వర్యంలో మరియు గ్రామ పెద్దలు, ప్రజలు సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఓడరేవు గ్రామ జనసేన పార్టీ నాయకులు టి. విజయ్ కుమార్, ఎం. మహేష్ , బి.వెంకటేష్ ,టి ప్రసాద్, సి.హెచ్ నాగరాజు, ఏసురాజు, సాయిరాం, మరియు జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.