గద్దరన్న జీవితమే ఓ పోరాటం

‘ఆతడు అనేక ప్రజా యుద్దముల ఆరితేరిన యోధుడు…’ అనే మాటలు ప్రజా నౌక దివంగత గద్దర్ గారికి అన్వయించడం అతిశయోక్తి కాబోదని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. పోరాటమే జీవితం.. జీవితమే పోరాటంగా జీవన యానం సాగించిన విప్లవకారుడు శ్రీ గద్దర్. మంది మాటలను పాటలుగా కూర్చి, ఆ పాటలనే తూటాలుగా పేర్చి జనం కోసం జనారణ్యంలో యుద్దమొనరించిన సైనికుడు శ్రీ గద్దర్. ఎప్పుడు కలిసినా తమ్ముడా అంటూ పలకరించే ఆయన పలకరింపు నా గుండెకు చేరువుగా గోచరిస్తుంది. నీ నాయకత్వం యువతకు నేడు అవసరం అని ఆయన చివరి క్షణాలలో చెప్పిన మాటలు నాలో సదా మారుమోగుతుంటాయి. శ్రీ గద్దర్ గారి జయంతి సందర్భంగా నా పక్షాన, జనసేన పక్షాన ఆయనకు నివాళి అర్పిస్తున్నానని జనసేనాని తెలిపారు.