ముత్తంశెట్టి కి వార్డు సమస్యలపై వినతిపత్రం అందించిన గణేష్ యాదవ్

భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ముత్తం శెట్టిశ్రీనివాస్ రావు కి వార్డు సమస్యలపై వినతిపత్రం అందించిన జనసేన పార్టీ 5వార్డు నాయకుడు యడ్ల గణేష్ యాదవ్

భీమిలి నియోజకవర్గం 5&7 వార్డులో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందిలు పడుతున్నారు అల్లూరి సీతారామరాజు నగర్, గణేష్ నగర్ ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజీ సమస్య, ఒక్కప్పుడు ఈ ప్రాతం లో గెడ్డలు ఉండేవి ఇప్పుడు అవి లేకుండా కనుమరుగు ఆయ్యాయి కారణం భూ కబ్జాలు. గెడ్డలు ఆక్రమించి పెద్ద పెద్ద ఇల్లు కట్టి గెడ్డలు మాయం చేస్తున్నారు, భూ కబ్జా దారులకు జీవీఎంసీ అధికారులు మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారు అని.. అదేవిదంగా రోడ్లు కూడా ఆద్వానంగా ఉండటం వల్ల అనేక మంది వాహనాదరులు విద్యర్థులు పెద్ద వారు పడిపోతున్నారు, అదేవిదంగా అన్ని కాలనీలకి అతి పెద్ద సమస్య పందులు సమస్య. 24 గంటలు ప్రజల మధ్యలో నివసిస్తున్నయి అధికారులు ఎన్ని సార్లు మోర పెట్టుకున్న తూ తూ మంత్రంగా వచ్చి వెళ్లిపోవడమే కానీ పందులు సమస్య మాత్రం ఇక్కడ ప్రజలకు తీరడం లేదు అని చిన్న పిల్లలు పై కూడా పందులు దాడి చేసిన సంఘటనాలు ఎన్నో ఉన్నాయి గుడి.. బడి అని తేడా లేదు ఏక్కడ అయినా పందులు సమస్యయే, ఈ పందులు వల్ల మలేరియా డెంగ్యూ వంటి విషజ్వరాలు వస్తాయి అని ఇక్కడ పందులు పెంపకదారులకు చెప్పిన పెద్ద చిన్న అని తేడా లేకుండా ప్రజలు పై తిరగపడుతున్నారు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అందరికి అందుబాటులో ఉండే విధంగా ఒక్క పార్క్, కల్యాణమండపం కూడా ఏర్పాటు చెయ్యాలి అని యడ్ల గణేష్ యాదవ్ కోరారు అదేవిదంగా 5వార్డు పరిధిలో ఉన్న గాంధీ నగర్ ప్రజలకు వర్షాలు వస్తే నరకమే అని ఎన్నో ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న అక్కడ ప్రజలకు కనీస మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందిలు పడుతున్నారు. రోడ్డు లేదు కాలువలు లేవు వర్షం వస్తే ప్రతి ఇంటిలోకి మోకాలులోతు నీరు. అధికారులు వచ్చి చూసి వెళ్లడమే తప్ప అక్కడ సమస్య పరిష్కారం అయితే జరగడం లేదు దయచేసి పెద్ద మనసు చేసుకొని మీరు ఈ సమస్యల మీద స్పందించి తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి అని యడ్ల గణేష్ యాదవ్ కోరారు.