రైతులకు తక్షణ సాయం చేయకపోతే పోరాటానికి సిద్ధం: జనసేన నాయకులు అనుకుల రమేష్

తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం తిరపతిపురం వద్ద వయ్యేరు కాలువ పొంగటం వలన సుమారు 800 ఎకరాలు మునిగిపోయి వరి పంట మొత్తం కుళ్ళి పోయి రైతులు భాధపడుతున్న తరుణంలో జనసేన పార్టీ వారి తరుపున పోరాటానికి సిద్దమవుతుందని తెలియచేయటమైనది. ఎమ్మెల్యే కారుమూరి పుట్టినరోజు వేడుక ఖర్చులలో సగభాగం పెట్టినా అక్కడ స్లూయిజ్ నిర్మాణం పూర్తవుతుందని ఒక వేళ మీరు ఆ నిర్మాణం చేపట్టకపోతే మా పోరాటం మొదలవుతుందని హెచ్చరిస్తున్నామని, పంట నష్టపోయిన రైతులకు తక్షణ సాయం కింద 25000/-రూపాయలు అందజేయాలని, అలాగే పశువులకు గ్రాసం కూడా ఏర్పాటు చేయాలని లేకుంటే మేము రైతుల తరపున పోరాటం చేస్తామని తెలియచేస్తున్నామని జనసేన నాయకులు అనుకుల రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు , కార్యకర్తలు, ప్రజలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.