మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం దిగిపోవాలి: పెండ్యాల శ్రీలత

★రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు.
★పవన్ కళ్యాణ్ ని విమర్శించేందుకేనా మంత్రి పదవులు.

జనసేన రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత

అనంతపురం, రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మహిళలకు కనీస రక్షణ కల్పించలేని ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలని జనసేన రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత డిమాండ్ చేశారు. బుధవారం ఆమె అనంతపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు దాడులు దౌర్జన్యాలు నిత్యకృత్యం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని నివారించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండటంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి అన్నారు. ప్రజా సమస్యలపై గళం ఎత్తుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కోలేక అనవసర ఆరోపణలు చేయడం మంత్రులకు పరిపాటిగా మారిందన్నారు. అసలు పవన్ కళ్యాణ్ ను విమర్శించేందుకే వీరికి మంత్రి పదవులు ఇచ్చారా అన్నట్టుగా ఉందన్నారు. తమ శాఖలపై పట్టులేని మంత్రులు తమ పదవులు కాపాడుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారన్నారు. వైసిపి నేతలు తమ తీరు మార్చుకోక పోతే ప్రజా క్షేత్రంలో వారికి గట్టి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు గుండాల మురళి, జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, వీర మహిళ కాశెట్టి సావిత్రి పాల్గొనడం జరిగింది.