మూడు హత్యలు ఆరు అత్యాచారాలుగా మారిన ఆంధ్రప్రదేశ్: దారం అనిత

మదనపల్లె, ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులు మూడు హత్యలు ఆరు అత్యాచారాలుగా మారినట్లు దేశవ్యాప్తంగా అందరూ అనుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ పాలన లో రాష్ట్రంలో నానాటికీ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం మహిళలపై జరుగుతున్న దాడుల్లో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ప్రతి గంటకు ముగ్గురు మహిళలపై దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో నేరాలకు ప్రధాన కారణం వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం దుకాణాలలో పర్మిట్ రూములు ఎత్తి వేయడమే ఇందుకు కారణం. దీంతో తాగుబోతులు గ్రామాలు పట్టణాల్లోని శివారు ప్రాంతాలలో తాగి రోడ్డు మీద పడుతున్నారు. ఈ కారణంతోనే మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరోవైపు ఆంధ్ర రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారింది శాంతిభద్రతల విషయంలో పక్క రాష్ట్రమైన చూసి నేర్చుకోవాలి ప్రస్తుత రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత కొన్ని సందర్భాల్లో చేస్తున్నా వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి చిన్నపిల్లల పెంపకమే సరిగా ఉండటం లేదని మాట్లాడి ఆమె స్పందిస్తున్న తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది. అనుభవం లేని వారికి కీలకమైన శాఖలు ఇస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయ్ అని స్పష్టంగా అర్థం అవుతోందని చిత్తూరు జిల్లా కార్యదర్శి దారం అనిత అన్నారు.