ఆత్మకూరు జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి

అనంత సాగరం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131 వ జయంతి సందర్భంగా అనంత సాగరం మండలం, బద్వేల్ రోడ్డు సెంటర్ వద్ద అంబేద్కర్ మహనీయుని విగ్రహానికి ఘననివాళులు అర్పిస్తూ.. అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఆయన ఆశయ సాధన కోసం నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరపున కృషి చేస్తానని తెలియజేస్తు.. మరొకసారి ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరపు నుంచి ఘనంగా అంబేద్కర్ గారి జయంతి స్మరించుకుంటూ ఘననివాళులు అర్పించారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్, మరియు అనంతసాగరం మండలం జన సేన పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సైఫుల్లా, మండల కార్యదర్శి ఎం. పెంచలయ్య, ప్రసాద్ మహ్మద్ రఫీ, వహీద్, రసూల్ పాల్గొనడం జరిగింది.