జాతీయ రైతు దినోత్సవ వేడుకలలో గుడివాడ జనసేన

  • కౌలు రైతుల కాపరి -పవన్ కళ్యాణ్
  • రైతు మిత్రుడు -పవన్ కళ్యాణ్
  • గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమం..
  • రైతుల సమస్యలపై నిత్యం పోరాడుతూ వారికి అండగా నిలబడుతున్న పవన్ కళ్యాణ్ ను రైతుబంధుగా కొనయాడుతున్న రాష్ట్ర రైతాంగం
  • రైతు లేనిదే మనిషి లేడు దేశానికి రైతే వెన్నుముక. రైతు కష్టపడితే తప్ప మన కంచంలోకి అన్నం రాదు. మానవాళిని బ్రతికించే వృత్తిని ఎన్నుకున్న రైతన్నలకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు. సందు పవన్, పాలంకి సారధి బాబు

గుడివాడ: జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని గుడివాడ నియోజకవర్గ జనసేన నాయకులు సందు పవన్, సారధి బాబు ఆధ్వర్యంలో గుడివాడ పట్టణం, నిమ్మ తోట, లోని వ్యవసాయ పొలాల్లో జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి స్థానిక రైతులకు పచ్చ కండువాలు కప్పి చిరు సత్కారం చేసిన జనసేన పార్టీ గుడివాడ పట్టణ నాయకులు, రూరల్ మండలం నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు.. ఈ సందర్భంగా సందు పవన్, సారధి బాబు, మాట్లాడుతూ.. రైతుల విషయంలో పవన్ కళ్యాణ్ గారు చరణ్ సింగ్ గారిని ఆదర్శంగా తీసుకొని అన్నదాతల మేలు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఏపీ లో రైతుబంధుగా ఆత్మహత్య చేసుకున్న 3000 కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక భరోసా అందిస్తూ వారికి జీవితంపై నమ్మకం కలిగిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని కౌలు రైతుల కాపరి గా కొనియాడుతున్నారని, రైతు భరోసా పథకం ఇచ్చేందుకు రైతుల మధ్య కులాల చిచ్చుపెట్టిన రైతు ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కులం, మతం, ప్రాంతం చూడకుండా కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుంటున్న రైతు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారని, రాష్ట్ర రైతాంగం కొనియాడుతున్నారన్నారు.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుందని పరిస్థితుల అధ్వానంగా ఉన్నాయని. ముఖ్యమంత్రి జగన్ రెడ్డిది ఐరన్ లెగ్ పాలన గనుకనే చేతి వరకు వచ్చిన పంట నోటి వరకు రావడం లేదని, అకాల వర్షాలు తుఫాను వలన రైతాంగం నష్టపోతుందని, వైసీపీ ప్రభుత్వంలో దళారులే లేరని రైతుబరుస కేంద్రాల ద్వారా దళారీ వ్యవస్థను నడుపుతూ రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని, రైతులు పడుతున్న కష్టాలను చూసి కూడా చేతకాని దద్దమ్మల మిగిలిపోయాడని నాయకులకు స్థానిక రైతులు వాపోయారు, ఉచిత విద్యుత్ కు మంగళం పాడి మోటార్లకు మీటర్లు బిగించి ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారన్నారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు… షేక్ మీరా షరీఫ్, మాచర్ల రామకృష్ణ, గంటా చైతన్య, షేక్ రబ్బాని, సనక నాని, కొట్టే శివ, అర్జా కృష్ణ, వడ్డే గిరి, నూనె. అయ్యప్ప, వీరమహిళలు, జనసైనికులతో పాటు స్థానిక రైతులు ప్రజలు పాల్గొన్నారు.