రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకి జనసేనాని జన్మదిన శుభాకాంక్షలు

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకి జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మీ రాజకీయ ప్రస్థానం బడుగు బలహీవర్గాలకు, ముఖ్యంగా మహిళలకు ఆదర్శమని ఒక ప్రకటనలో తెలియజేశారు. సామాన్య కుటుంబాలకు చెందిన వ్యక్తులు కూడా రాష్ట్రపతి వంటి అత్యున్నతమైన పదవులను అలంకరించవచ్చని మీరు నిరూపించారు. మీకు ఆ భగవంతుడు ఆరోగ్యంతో కూడిన సంపూర్ణ ఆయుష్షును ప్రసాదించాలని తన తరఫున, జనసేన శ్రేణుల తరఫున మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.