రాత్రి పూట స్ట్రీట్ లైట్స్ ఆన్ చేయాలని పఠాన్ చెరు జనసేన వినతి

పఠాన్ చెరు, గత కొద్ది రోజులుగా బీరంగూడ కమాన్ నుంచి కృష్ణారెడ్డి పేట వెళ్లే దారిలో రాత్రి పూట స్ట్రీట్ లైట్స్ ఆన్ చేయట్లేదు కానీ అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ బోర్డ్స్ కి సంబంధించిన లైట్స్ మాత్రం ఎప్పుడూ ఆన్ చేసి ఉంటున్నాయి. స్ట్రీట్ లైట్స్ ఆన్ చేయకపోవడం వలన బైక్స్ మీద, కాలినడకన ఆ మార్గమధ్యంలో వెళ్లే వాళ్లకు మరియు రోడ్ క్రాస్ చేసే వాళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. తరచుగా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి రీసెంట్ గా ఒక ఫ్యామిలీ బైక్ మీద నుంచి కింద పడడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఇలాంటి సంఘటనలు గమనిస్తూనే ఉన్నాము, ఆ దారిలో ప్రయాణించే ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని మంగళవారం జనసేన పార్టీ తరఫున అమీన్ పూర్ మండల్ ఏఈకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ యడమ రాజేష్, నాయకులు చంద్రకాంత్, శ్రీకాంత్, మహేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.