అమిత్ షాకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్ర నేత శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ వ్యూహాత్మక నేతల్లో ఒకరైన శ్రీ అమిత్ షా గారి రాజకీయ ప్రస్థానం అనితర సాధ్యమైనది. రాజకీయంగా ఎన్నో విజయాలు, ఒడిదుడుకులు చూశారు. భారతీయ జనతా పార్టీకి, భారతదేశానికి శ్రీ అమిత్ షా గారు చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. కార్య సాధనలో పట్టుదల, కార్యాచరణలో నిర్దిష్టత ఆయన విజయానికి మూల సూత్రాలుగా చెప్పుకోవచ్చు. శ్రీ అమిత్ షా గారికి ఆ భగవంతుడు ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షు ప్రసాదించాలని నా పక్షాన, జనసేన పక్షాన కోరుకుంటున్నాను. ఆయన విజయ ప్రస్థానం నిరంతరాయంగా కొనసాగాలని మనసారా కాంక్షిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.