బండారు దత్తాత్రేయకి జన్మదిన శుభాకాంక్షలు

గౌరవనీయ హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలపై ఆయనకు గల మక్కువ, ముఖ్యంగా తెలంగాణ జీవన విధానంపై ఆయనకు గల అవాజ్యమైన అనురాగం నన్నెంతగానో ఆకట్టుకుంటుంది. ప్రతి ఏటా విజయదశమి అనంతరం ఆయన నిర్వహించే అలయ్ – బలయ్ వేడుక నాకెంతో ఇష్టం. గత సంవత్సరంలో జరిగిన అలయ్ – బలయ్ వేడుకకు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవించడం ఎన్నటికీ మరచిపోలేను. మృదు మనస్తత్వంతో నిరాడంబరంగా ఉండటం ఆయన జీవన శైలిని తెలియచేస్తోంది. వివాదాలకు దూరంగా, చిన్న పెద్ద అనే భేదం లేకుండా ప్రతీ ఒక్కరిని గౌరవించే శ్రీ దత్తాత్రేయ గారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, ఆయనకు ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని శ్రీ పవన్ కళ్యాణ్ ఆకాక్షించారు.