ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు: పెంటేల బాలాజీ

చిలకలూరిపేట: జనసేన నియోజకవర్గ నాయకులుపెంటేలబాలాజీ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.
అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచం ప్రగతి పథంలో నడుస్తుంది అంటే దానికి కారణం ముఖ్యంగా ఉపాధ్యాయులని వారు లేనిదే ప్రపంచం లేదని విద్యార్థులకు తల్లి తండ్రుల తరువాత గురువే దైవం అని తెలియజేశారు. నాగరికత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దే వృత్తిలో ఉపాధ్యాయులు ఎల్లవేళల అఖుంటిత దీక్షతో శ్రమ చేస్తున్నారు. వారిని గౌరవించుకోవటం మన బాధ్యత అని, ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా పనికి తగ్గ వేతనాన్ని, నిర్దిష్ట పని గంటలను, కావలసిన వైద్య సదుపాయాలను అందచేయాలని ఆయన మాట్లాడారు. మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు అనేక సభలలో ఉపాధ్యాయలకోసం తాము అండగా ఉంటామని జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రైవేటు ఉపాధ్యాయులకు కావాల్సిన హక్కులను, సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారని బాలాజి తెలిపారు.