మత్స్యకార యువతకు జనసేన నైపుణ్య భరోసా

జనసేన పార్టీ తరఫున ఉత్తరాంధ్రలో ఉపాధి నైపుణ్య శిక్షణ కేంద్రం మొదలు కానుంది. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి భారీగా మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారని తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు మత్స్యకార యువతలో ఉపాధి నైపుణ్యం పెంచేలా, వారి ఉపాధికి భరోసా చూపేలా ప్రత్యేక శిక్షణ కేంద్రం, అలాగే పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే వారికి అవసరం అయిన సహాయం చేసేందుకు దీనిని ఉత్తరాంధ్రలో మొదలుపెట్టాలని భావించారు. దీనిలో భాగంగా పార్టీ మత్స్యకార వికాస విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక ఉపాధి నైపుణ్య శిక్షణ కేంద్రం పోస్టర్ ను శుక్రవారం పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విశాఖలో విడుదల చేశారు. వివిధ అంశాల వారీగా మత్స్యకార యువతకు దీనిలో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి గల మత్స్యకార యువత పార్టీ టోల్ ఫ్రీ నెంబర్లు సంప్రదిస్తే వారి పేర్లను ఎన్ రోల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ : 83318 38383 గా ఉంటుంది. ఈ కార్యక్రమంలో పార్టీ మత్స్యకార వికాస విభాగం నేత డా.మూగి శ్రీనివాస్ పాల్గొన్నారు.
* క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు అందజేత
ఇటీవల వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యులకు ఇద్దరి కుటుంబాలకి పార్టీ తరఫున రూ.5 లక్షల బీమా చెక్కులను నాదెండ్ల మనోహర్ గారు శుక్రవారం అందజేశారు. పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన గార్లంక వెంకటేశ్వరరావు, యలమంచిలి నియోజకవర్గానికి చెందిన గొన్నాబత్తుల మహేశ్వరరావు ఇటీవల జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన ఇద్దరు క్రీయాశీలక కార్యకర్తల కుటుంబ సభ్యులైన గార్లంక జమ్మిరాజు, శ్రీమతి గొన్నాబత్తుల భవానీలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా నిలబడుతుందని వారికి హామీ ఇచ్చారు.