అర్హులైన వారికి పింఛన్లు తొలగిస్తే ఉద్యమిస్తాం: పిడుగురాళ్ల జనసేన

పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల మండలంలో సుమారు 1000 మందికి పైగా పించన్లు లబ్ధిదారులను తొలగిస్తామంటూ అధికారులు నోటీసులు జారీచేయటం జరిగిందని. పొంతన లేని సాకులు చూపిస్తూ.. పేదలకు కన్నీళ్లు మిగిల్చేలా.. ఈ ప్రభుత్వం, పేద వృద్ధుల, వికలాంగుల, ఒంటరి మహిళల ఆసరాగా ఉండే పింఛన్లు తొలగిస్తూ.. దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, ఈ హేయమైన చర్య అని ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని జనసేన పార్టీ తరఫున పిడుగురాళ్ల జనసేన నాయకులు డిమాండ్ చేశారు, దీనికి సంబంధించి పునరాలోచించుకోని అర్హులైన అందరికీ యధావిధిగా పింఛన్లు జారీ చేయవలసిందిగా సంబందిత పిడుగురాళ్ల మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాశీం సైదా, నియోజవర్గ ఐటీ కోఆర్డినేటర్ మునగా వెంకట్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు దూదేకుల సలీం, మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్, పెడకొలిమి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శులు గుర్రం కోటేశ్వరరావు, షేక్ మదీనా, బేతంచర్ల ప్రసాద్, నాగేశ్వరరావు, అంబటి సాయి, రామాంజి, తదితరులు పాల్గొన్నారు.