ఒక్క చాన్స్ ఇస్తే ఇంత‌ అద్వాన్న పాలనా??

  • జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్
  • బాకవానితోటలో గుంతల రోడ్లపై జనసేన, టిడిపి నిరసన

మదనపల్లె: పాడైపోతున్న రోడ్లకు మరమ్మత్తులు చేయరా అంటూ పాలకులు, అధికారుల వైఖరిని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ ప్రశ్నించారు. ప్రమాదాలు జరిగితే కానీ స్పందించరా, వైసిపి పాలకులు కళ్లకు గంతలు కట్టుకున్నారని, వాళ్లకు రోడ్లపై పడిన గుంతలు కనిపించడం లేదని జనసేన, టిడిపి నాయకులు విమర్శించారు. మదనపల్లెలో నెలకొన్న సమస్యలపై టిడిపి-జనసేన కలిసి ఉమ్మడి పోరాటం చేస్తూనే ఉంటామని ప్రకటించారు. గుంతల ఆంధ్రప్రదేశ్‌కి దారేది పేరుతో జనసేన, టిడిపి ఆధ్వర్యంలో ఆదివారం మదనపల్లె టౌన్ బాకవానితోట హెచ్.పి గ్యాస్ ఆఫీస్ రోడ్డులో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు నాదెళ్ల విద్యాసాగర్, రాటకొండ మధుబాబు, నాగుర్ వల్లి, యాలగిరి దొరస్వామినాయుడు, నాదెళ్ల అరుణ్ తేజ్, గంగారపు నవీన్ చౌదరి, గంగారపు గౌతమ్‌ రెడ్డి, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, అర్జున, పురం నగేష్, గడ్డం లక్ష్మిపతి, జనర్దన్, ఆది నారాయణ, లవన్న, నారాయణ స్వామి, పవన్ శంకర, నరేష్, నరేంద్ర పాల్గొన్నారు. ఈ‌ సందర్భంగా జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఉన్న అంతర్గత రహదారులు అధ్వానంగా తయారయ్యాయని మండిపడ్డారు. గోతులు పడ్డ రోడ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేయించి అవసరమైన చోట కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రజావంచక ప్రభుత్వాన్ని సాగనంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాదెళ్ల విద్యాసాగర్, అడపా సురేంద్ర, నాగుర్ వల్లి ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‌ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి నాయకులు పాల్గొన్నారు. ‌